దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, త్వరలోనే డెల్టాను అధిగమిస్తుందని వెల్లడిరచింది. తక్కువ సమయంలో ఈ వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్నాయని, ఇది చాలా సులభంగా రోగనిరోధక శక్తిని తప్పించుకుంటోందని పేర్కొంది. అన్ని దేశాల్లోను ఒమిక్రాన్ ఉనికిని కనుగొన్నం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో ఇదే అతిపెద్ద ఆధిపత్య వేరియంట్. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు ఏదో జలుబులా భావిస్తున్నారు. దీని తీవ్రత అంతగా ఉండదని ఊహించుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఈ వేరియంట్‌తో ఆసుపత్రులు పాలవుతున్న వారూ అధికంగా ఉన్నారు. ఇప్పటికే రోగాలున్న వారు వృద్ధులు, టీకాలు తీసుకోనివారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ శాస్త్రవేత్త మరియా వాన్ కెరోవ్ తెలిపారు.