ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. దుబాయిలో ఓ ప్రవాస భారతీయుడి విషయంలో అదే జరిగింది. తొలిసారి పాల్గొన్న డ్రాలోనే మనోడికి జాక్‌పాట్ తగిలింది. ఇక నుంచి భారత వ్యక్తికి 25ఏళ్ల పాటు ప్రతినెల 25వేల దిర్హమ్స్ (రూ.5.60లక్షలు) వస్తాయి. ఫాస్ట్5 ఎమిరేట్స్ డ్రా లో కేవలం 25 దిర్హమ్స్ పెట్టి కొన్న టికెట్‌కు దుబాయిలో ఉండే మహ్మద్ అదిల్ ఖాన్ అనే భారతీయుడికి ఇలా అదృష్టం వరించింది. 33ఏళ్ల అదిల్ ఖాన్ దుబాయిలో ఐదేళ్లుగా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా అదిల్ ఖాన్ మాట్లాడుతూ ఎమిరేట్స్ డ్రాలో పాల్గొన్న మొదటిసారే విజేతగా నిలవడం అనేది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నిర్వాహకుల నుండి నాకు కాల్ వచ్చినప్పుడు, మొదట నమ్మలేకపోయాను. కానీ, ఆ తర్వాత వారు చెప్పిన వివరాలతో ఒక్కసారిగా ఎగిరిగంతేసినంత పని చేశాను. వచ్చే 25 సంవత్సరాలకు నెలవారీ 25వేల దిర్హమ్స్ వస్తాయి. త్వరగా పదవీ విరమణ చేయవచ్చు. ఇక నా భవిష్యత్తు సురక్షితం అని చెప్పుకొచ్చాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)