టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ హంట్. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు టీం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణగారు మనల్ని వదిలివెళ్లిన తర్వాత విడుదలవుతున్న నా తొలి సినిమా ఇది. సినిమా విడుదలయ్యాక ఫస్ట్ షో అయిన తర్వాత ఆయన నుంచి మొదటి ఫోన్ కాల్ వస్తది. నేనది మిస్సవుతున్నా. మొదట నేను సినిమాల్లోకి వస్తాను అని చెప్పినపుడు అందరికీ అయోమయం. కానీ కృష్ణగారు కష్టపడితే సక్సెస్ అవుతాడు చేయనివ్వండి అని అన్నారు. అప్పటి నుంచి నా లైఫ్ తీసుకోవడమే కాదు మంచి గౌరవం, విలువ దక్కింది.
నా లైఫ్లో ఎంత దూరం వెళ్తానో తెలియదు. ఈ పయనం మాత్రం మామయ్య గారికే అంకితం. శ్రీకాంత్, భరత్ లేకపోతే హంట్ సినిమా పూర్తవదు. డైరెక్టర్ ఈ సినిమా విడుదలయ్యాక నా కన్నా పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతానంటూ చెప్పుకొచ్చాడు. చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 26న మా సంస్థలో నిర్మించిన హంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్న తెలుగు చిత్రమిది. మా ఆప్తులు శ్రీకాంత్ గారితో తొలిసారి అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే, భరత్ గారితో ఇక, సుధీర్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాు అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు మహేష్ వచ్చి రెండు గంటలు కథ చెప్పినప్పుడు వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. నేను హంట్ చేయడానికి భవ్య క్రియేషన్స్, సుధీర్ బాబు. నాకు సుధీర్ బాబు బ్రదర్ లాంటి వ్యక్తి. మంచి సినిమాలో నేను ఉండాలని చేశా. దర్శకులు కథ బాగా చెప్పినా తీసేటప్పటికి ఒక్కోసారి వేరేలా వెళ్లొచ్చు. అనుకున్న దాని కంటే ఈ సినిమా బాగా వచ్చింది. దర్శకుడు మహేష్ క్లారిటీతో తీశాడు. సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. నేను హంట్ చూశా. పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, నటి మౌనికా రెడ్డి పాల్గొన్నారు.