Namaste NRI

ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ :  దానయ్య

నాని హీరోగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం.  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సుదర్శన్‌ థియేటర్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అన్యాయాన్ని సహించని యువకుడు సూర్య పాత్రలో నాని, క్రూరమైన పోలీస్‌ అధికారి దయానంద్‌ క్యారెక్టర్‌లో ఎస్‌జే సూర్య కనిపించారు. వీరిద్దరి మధ్య జరిగే ఇంటెన్స్‌వార్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సుదర్శన్‌ థియేటర్‌కు నాకు చాలా స్పెషల్‌. మీ అందరితో కలిసి ట్రైలర్‌ చూడటం ఆనందంగా ఉంది. ఈ నెల 29న థియేటర్లలో మనందరం పండగ జరుపుకుందాం అన్నారు. కథా నాయిక ప్రియాంక అరుళ్‌ మోహన్‌, సూర్యతో ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించా మని ఎస్‌జే సూర్య తెలిపారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతాన్నందించారు.ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events