Namaste NRI

ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌: హీరో నిఖిల్

అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌  సమర్పకుడిగా తెరకెక్కిన చిత్రం ఆయ్‌. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకుడు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు, విద్యా కొప్పినీడు నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. హీరో నిఖిల్‌, శ్రీలీల ముఖ్య అతిధులుగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడిన అల్లు అరవింద్‌ ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు కొడితే పదిమంది కింద పడే కథ కాదు కదా? అనడిగాను. ఎంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం వారు పడాలని ఎన్టీఆర్‌ ఓ సందర్భంలో అన్నారు. నార్నే నితిన్‌ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అన్నారు.

Ixora 78

హీరో నిఖిల్ మాట్లాడుతు  సోషల్‌మీడియాతో పాటు బయట ఎక్కడ చూసినా ఆయ్‌ సందడే కనిపిస్తున్నదని, ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలని ఆకాంక్షించారు. ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు సినిమా గుర్తుకొచ్చిం ది. నార్నే నితిన్‌ అంకితభావంతో పనిచేశాడు అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ కథ విన్న తర్వాత అల్లు అరవింద్‌గారు ఫోన్‌ చేసి ఎంతగానో ఎంకరేజ్‌ చేశారని, ఈ ప్రపంచంలో కులాలు, మతాల కంటే స్నేహమే గొప్పదనే అంశాన్ని ఈ సినిమాలో చూపించామని హీరో నార్నే నితిన్‌ పేర్కొన్నారు.

Mayfair 78
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events