ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం బేబీ. సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎన్. నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా రషెస్ చూసిన తర్వాత ఇదొక కల్ట్ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమా చూసి విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి మీ తమ్ముడు అద్భుతంగా పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు అని చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో ఆనంద్ నటన కన్నీళ్లు తెప్పిస్తుంది అన్నారు. నిన్న మా టీమ్ అంతా ఈ సినిమా చూశాం. ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండకు మంచి బ్రేక్ రాబోతున్నది. హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే చిత్రమిది అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తుందని, పాటలు అద్భుతంగా ఉన్నాయని బలగం వేణు పేర్కొన్నారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని నిర్మాత ఎస్.కె.ఎన్. తెలిపారు.














