Namaste NRI

ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్

నరేన్‌, ప్రీతిసుందర్‌ జంటగా నటించిన చిత్రం ఆ గ్యాంగ్‌ రేపు-3. వైరల్‌ షార్ట్‌ఫిల్మ్‌ సిరీస్‌ ఆ గ్యాంగ్‌ రేపు టీమ్‌ రూపొందించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. యోగీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నోక్షియస్‌ నాగ్స్‌ నిర్మాత. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్బంగా దర్శకుడు యోగేష్‌ కుమార్‌ మాట్లాడుతూ 2015లో అనుకోకుండా నేను చేసిన చిన్న ప్రయత్నం వైరలై, మంచి గుర్తింపు తెచ్చింది. గ్యాంగ్‌ రేపు 2 కూడా హిట్‌ అయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందర్ని అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ట్రైలర్‌లోనే దర్శకుడి విజన్‌ అర్థమైపోతుంది. మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది. అందరూ హార్డ్‌ వర్క్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది  అని నిర్మాత నోక్షియస్‌ నాగ్స్‌ అన్నారు.  ఈ చిత్రానికి బ్యానర్‌: సహచర ప్రొడక్షన్స్‌, నిర్మాత: నోక్షియస్‌ నాగ్స్‌, దర్శకుడు: యోగేష్‌ కుమార్‌, డీఓపీ: నాని ఐనవల్లి, సంగీతం: కబీర్‌ రఫీ, ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ జల్లు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events