Namaste NRI

ఈ  సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ : నవీన్‌ యెర్నేని

సుశాంత్‌, జాన్య జోషి, విధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కిస్‌ కిస్‌ కిస్సిక్‌. శివ్‌ హరే దర్శకుడు. గణేష్‌ ఆచార్య, విధి ఆచార్య నిర్మాతలు. విజయ్‌రాజ్‌, మురళీశర్మ, కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. నిర్మాత గణేశ్‌ ఆచార్య మాట్లాడుతూ ఇది బ్యూటిఫుల్‌ కాన్సెప్ట్‌. మైత్రీ బ్లాక్‌బస్టర్‌ పుష్ప2 లోని కిస్‌ కిస్‌ కిస్సిక్‌ పాట పల్లవిలోని తొలి పదం మా సినిమా టైటిల్‌ కావడం ఆనందంగా ఉంది.న్యూటాలెంట్‌ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. యాక్షన్‌, రొమాన్స్‌ అన్నీ ఉన్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ ఇది  అని తెలిపారు.

రషెస్‌ చూశాను. సినిమా చాలా లావిష్‌గా ఉంది. మంచి ఎంటైర్టెనర్‌. ఇందులో తొమ్మిది పాటలున్నాయి. వాటిలో అయిదు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తప్పకుండా సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది  అని మైత్రీ అధినేత నవీన్‌ యెర్నేని ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా ఇందులో నటించిన సుశాంత్‌, జాన్య జోషి, విధి కూడా మాట్లాడారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ వివిధ భాషల్లో ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]