Skip to main content

Namaste NRI

ఈ సినిమా ఖచ్చితంగా హిట్‌… ఆశిష్‌ 

ఆశిష్‌ కథానాయకుడిగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ తెరకెక్కించిన చిత్రం  లవ్‌మీ.  నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ నాకు సినిమా తప్ప మరేదీ తెలియదు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ను ఆరంభించే ముందు, ఏ సినిమా చేసినా వినూత్నంగా ఉండాలని అనుకున్నాం. అలా తొలి ప్రయత్నంగా బలగం చేశాం. ఇప్పుడు లవ్‌మీ కూడా సరికొత్త కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.   ప్రేక్షకుల హృదయాలను గెలవటమే ఆశిష్‌ ముందున్న పెద్ద ఛాలెంజ్‌ అని, కష్టపడితే తను తప్పకుండా లక్ష్యాని చేరుకుంటాడని అన్నారు.

ఈ సినిమాలో దర్శకుడు అరుణ్‌ భీమవరపు నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేకు కొత్త అర్థాన్నిచ్చాడని, సినిమా విజయంపై అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఈ సినిమాకు కిల్‌ మీ ఇఫ్‌ యు లవ్‌ పేరుతో సీక్వెల్‌ కూడా ఉందని, త్వరలో దానిని ప్రారంభించాలని కోరుకుంటున్నానని దర్శకుడు అరుణ్‌ భీమవరపు పేర్కొన్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్‌ కొడుతున్నామని హీరో ఆశిష్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News