Namaste NRI

కచ్చితంగా ఈ సినిమా హిట్‌ : రవితేజ

ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించిన చిత్రం ఛాంగురే బంగారురాజా. సతీశ్‌వర్మ దర్శకుడు. కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు పెద్ద వంశీగారు గుర్తొచ్చారు. ఈస్ట్‌ గోదావరి వెటకారం, ఆ హ్యూమర్‌ నిజంగా ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు రోజులు గుర్తొచ్చాయ్‌ అన్నారు. ఇందులో కొత్తవాళ్లే ఎక్కువగా పనిచేశారు. సినిమా విడుదలయ్యాక వారందరి పేర్లు మోగిపోతాయ్‌. కచ్చితంగా హిట్‌ సినిమా ఇది అని నమ్మకం వ్యక్తం చేశారు. రవితేజని ఆదర్శంగా తీసుకొని హీరో అయిన నేను ఆయన నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటించడం గొప్ప అనుభూతి అని హీరో కార్తీక్ రత్నం  సంతోషం వెలిబుచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ  రవితేజ నన్ను నమ్మి బంగారంలాంటి అవకాశం ఇచ్చారు. కుటుంబసమేతంగా అందరూ చూడదగ్గ సినిమా ఇది  అన్నారు. హీరో శ్రీ విష్ణు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కృష్ణ చైతన్య, సందీప్ రాజ్, వంశీ, వెంకటేష్ మహా, నిర్మాత శరత్ మరార్, వివేక్ కూచిభొట్ల, ఎస్కేఎన్.. తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ఛాంగురే బంగారురాజా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events