Namaste NRI

ఖైదీని మించేలా ఈ సినిమా:  కార్తీ

కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం జపాన్‌. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాజు మురుగన్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కార్తీ మాట్లాడుతూ జపాన్‌ కథ విన్నప్పుడే కథానుగుణంగా మారాలని ఫిక్సయ్యానని, ఇది తన మనసుకు దగ్గరైన కథ అని, వినోదంతోపాటు ఆలోచింపజేసే సినిమా ఇదని, తన ఖైదీ చిత్రాన్ని మించేలా ఈ సినిమా ఉంటుదని చెప్పారు. హీరో నాని మాట్లాడుతూ ఈగ తర్వాత నేను తమిళనాడు వెళ్తే, అక్కడ చాలా మంది మా తమిళబ్బాయిలాగే ఉన్నావయ్యా అన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన కార్తీ కూడా అంతే. ఇక్కడవాళ్లకు అచ్చం తెలుగబ్బాయిలా అనిపిస్తారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కార్తీ జపాన్‌ తో షాకింగ్‌ గెటప్‌తో మనముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.  ఇంకా చిత్ర యూనిట్‌తో పాటు పైడివల్లి వంశీ తదితరులు కూడా పాల్గొన్నారు. నవంబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events