Skip to main content

Namaste NRI

ఈ సినిమా తప్పకుండా విజయం: అక్కినేని అమల

చైతన్యరావ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న సినిమా హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌. బాల రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్‌, బాలరాజ్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని అక్కినేని అమల విడుదల చేశారు. టీజర్‌ ఫన్నీగా రొమాంటిగ్గా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే కథ ఇది. మా అన్నపూర్ణ ఫిల్మ్‌ మేకింగ్‌ కాలేజ్‌ ఫాకల్టీలు, స్టాఫ్‌, విద్యార్థులు ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమా తప్ప కుండా విజయం సాధిస్తుంది అని అమల నమ్మకం వెలిబుచ్చారు.

రొమాంటిక్‌ కామెడీ డ్రామాతో రూపొందు తున్న హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. తనికెళ్లభరణి, సుహాసిని, అరవింద్‌కృష్ణ, అలీ, సురేఖవాణి, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తు న్నారు.  ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: శిష్ట్లా వి.ఎం.కె, సంగీతం: కల్యాణి మాలిక్‌, నేపథ్యసంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌.

Social Share Spread Message

Latest News