వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సాగు. వినయ్త్న్రం దర్శకత్వం. ఈ చిత్రాన్ని డా॥యశస్వి వంగా నిర్మించారు. నిహారిక కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు వివిధ ఓటీటీ మాధ్యమాల్లో ఈ నెల 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ వ్యవసాయదారుల జీవితాల్లో ఆశలను నింపే కథాం శమిది. ఎలాంటి కష్టాలు వచ్చినా పట్టుదలతో ముందుకుసాగాలనే సందేశాన్నిస్తున్నాం. ఈ సినిమాలో రైతు కష్టాలను ఆవిష్కరించాం అని చెప్పింది. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదనే గొప్ప సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు వినయ్ రత్నం తెలిపారు. సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేశానని హారిక బల్ల తెలిపింది.