సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్యనైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరా బాద్‌లోని ఫిలిం ఛాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి చర్చించే కథాంశమిది. సందేశంతో పాటు చక్కటి వినోదం ఉంటుంది. ఈతరం సంస్థ సినిమాల తరహాలో సమాజానికి ఉపయుక్తమయ్యే కథగా నిలుస్తుంది. సమాజంలో మార్పు రావాలని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం అన్నారు.
దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను మాజీ నక్సలైట్‌గా నటించాను. ఇందులో హీరో సుమన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. జనం చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా చేస్తున్నా. పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. నిజాయితీకి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి, సంగీతం: రాజ్‌కిరణ్, కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత: వెంకట రమణ పసుపులేటి. ఈ కార్యక్రమంలో సుమన్, అజయ్ ఘోష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్, వి.సముద్ర, పసుపులేటి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.