సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరోం హర. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ దర్శకత్వం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు నన్ను కొత్తగా ప్రజెంట్ చేశాడు. టీజర్లో నా లుక్ అదిరిపోయిందని అందరూ అంటున్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్ కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుందని బలంగా విశ్వసిస్తున్నా అన్నారు. దేశవ్యాప్తంగా టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, చేతన్ భరద్వాజ్ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లిందని దర్శకుడు జ్ఞానసాగర్ తెలిపారు. టీజర్‌కు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తున్నదని, నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత సుమంత్ జి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)