సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష్ణ. సంయుక్త మీనన్ నాయిక. కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించారు.
సుకుమార్ మాట్లాడుతూ ప్రమాదం నుంచి బయటపడ్డాక సాయితేజ్ నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. నటుడిగా ఇది సాయిధరమ్ తేజ్‌కు పునర్జన్మ లాంటిది అన్నారు. దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ సుకుమార్ ఈ కథ విని తనే స్క్రీన్‌ప్లే రాసి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. ఈ సినిమా మా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇదే గ్రౌండ్లో చిన్నప్పుడు ఆడుకునేవారం. ఇక్కడ మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మా ట్లాడుతూ బైక్ యాక్సిడెంట్ జరిగాక ఎంతో బాధను అనుభవించాను. నేను మళ్లీ నిలదొక్కుకోవాలి అనే పట్టుదలతో ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాను. సుకుమార్ ఈ సినిమాకు నిర్మాత కావడం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు.