Namaste NRI

భవిష్యత్‌లో ఈ చిత్రం  మరింత ప్రేక్షకాదరణ : సందీప్‌ కిషన్‌

కార్తీక్‌ రత్నం, సంపత్‌రాజ్‌, హెబ్బాపటేల్‌, కామ్నా జెఠల్మానీ ముఖ్యపాత్రల్లో రూపొందిన వెబ్‌ సిరీస్‌ వ్యవస్థ. ఆనంద్‌ రంగ దర్శకత్వంలో పట్టాభి చిలుకూరి, ఆనంద్‌రంగ నిర్మించారు. జీ5లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సమావేశానికి సందీప్‌ కిషన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 మిలియన్స్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌తో వ్యవస్థను ప్రేక్షకులు ఆదరించడం సంతోషంగా వుంది. భవిష్యత్‌లో ఇది మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తున్నాను అన్నారు. జీ5 సంస్థకు ఈ సిరీస్‌ సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని ఆ సంస్థ తెలుగు కంటెంట్‌ హెడ్‌ సాయితేజ్‌ దేశ్‌ రాజ్‌ తెలిపారు. ఈ సమావేశంలో సిరీస్‌ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events