హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్‌ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వారి ఫ్యామిలీతో కలిసి చూస్తూ సినిమాను ఎంజారు చేస్తారు అని అన్నారు.

మా మూవీ నుంచి రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ మీకు నచ్చాయి.ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్‌ను మించి సినిమాలో చూస్తారు. ఈ ఫ్యూరిటీ, ఎమోషన్స్ సినిమాలో ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా కనిపిస్తాయి అని హీరోయిన్ వేద జలంధర్ చెప్పారు. హీరో సాయి తేజ్ మాట్లాడుత మన లైఫ్‌లో మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్‌ను ఇస్తాయి. అలాంటి వాటిని గుర్తు చేసే సినిమా ఇది అని తెలిపారు. మా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వెంకటేష్‌కి థ్యాంక్స్. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్‌లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ప్రేక్షకుల టైమ్, డబ్బుకు విలువ ఇస్తాను. మా మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్స్‌కు వెళ్లి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేయండి అని కిరణ్ అబ్బవరం చెప్పారు.















