శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం మది. నాగ ధనుష్ దర్శకుడు. ప్రగతి పిక్చర్స్పై రామ్కిషన్ నిర్మిసుతన్నారు. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈతరం యువత ఆలోచనలకు అద్దంపట్టే విధంగా ఉన్న సినిమా ఇది. వినూత్న రీతిలో కథనం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. రఘు కుంచె, సునీత, రమ్యాబె హ్రా, దీవు, సాయి చరణ్, హరిణి ఆలపించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీవీఆర్ రాజా, సమర్పణ: ఆర్వీ రెడ్డి. సహ నిర్మాత : ఆర్వీ సినిమాస్, కెమెరా: విజయ్ ఠాగూర్.














