రోజూ ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మధుమేహం బారిన పడుతామని తాజా అధ్యయనం చెబుతున్నది. రోజుకు 50 గ్రామలు కన్నా ఎక్కువ గుడ్లు తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60 శాతం మేర ఉన్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడిరచింది. 1991 నుంచి 2009 వరకు చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీలతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం మన సొంతం అంతేకాదా ఇప్పటివరకు మనకు తెలిసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)