Namaste NRI

ఈ కథ మీ అందరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది..  బేబీ ట్రైలర్‌లో ఆనంద్‌ దేవరకొండ 

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. ఈ  చిత్రం  ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు చాలా బాగుందని మెచ్చుకున్నారు. నా ప్రతిభ మీద నమ్మకంతో నిర్మాత అవకాశమిచ్చారు. ఈ సినిమాతో దర్శకుడిగా నా ప్రయాణం మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా అన్నారు. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ  థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజుల పాటు ఈ సినిమా ప్రేక్షకులను వెంటాడుతుంది. అంతటి బలమైన భావోద్వేగాలుంటాయి. అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం శ్రమించారు. ఈ కథ మీ అందరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది  అని తెలిపారు. హృదయాలను తడిమే ఎమోషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విరాజ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. ఈ నెల 14న విడుదల కానుంది.  ఈ కార్యక్రమంలో దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతి, నిర్మాత బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events