Namaste NRI

ఈ థియేటర్‌ మాకొక  దేవాలయం : బాలకృష్ణ  

 హైదరాబాద్‌ కాచిగూడ చౌరస్తాలోని ఏషియన్‌ తారకరామ థియేటర్‌ను నందమూరి బాలకృష్ణ  ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని మా తల్లి జ్జాపకార్థం కట్టాం. ఆ ఆస్పత్రి మాకో దేవాలయం. అలాగే ఈ థియేటర్‌ కూడా మాకు దేవాలయంలో సమానం. అమ్మానాన్నల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌ను 1978లో ప్రారంభించాం. అక్బర్‌ సలీం అనార్కలి సినిమాతో ఆ థియేటర్‌ ప్రయాణం మొదలైంది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల నిలిచిపోయిన తారకరామ థియేటర్‌ను 1995లో మళ్లీ ప్రారంభించాం. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగునంగా సరికొత్త హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.  ఈ మూవీ థియేటర్‌కు ఓ చరిత్ర ఉంది. తారకరామలో దాన్‌ సినిమా 525 రోజులు ఆడిరది. అంతేకాదు నా సినిమాలు కూడా మంచి సక్సెస్‌ అందుకున్నాయి. ఈ థియేటర్‌కు నాకు సెంటిమెంట్‌, నా కుమారుడు మోక్షజ్ఞ తారక రామా తేజ పేరును నాన్న ఈ థియేటర్‌కు పెట్టారు. మాకు ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి ఏషియన్‌ తారకరామాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ.  ఈ  థియేటర్‌లో డిసెంబర్‌ 16 నుంచి అవతార్‌ 2స్క్రీనింగ్‌ కానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress