లక్షల ఖరీదు చేసే మందు బాటిళ్లను చూసుంటాం. ప్రముఖ కంపెనీలకు చెందిన వైన్ బాటిళ్లకు భారీ మొత్తాన్ని వెచ్చించి కొంటూ ఉంటారు. ఎందుకంటే అందులో మత్తు కోసం అంత మొత్తం వెచ్చిస్తారు. కానీ లక్షల ఖరీదు చేసే వాటర్ బాటిల్‌ని చూశారా. వాటర్ బాటిల్ ధర రూ.45 లక్షలు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటొ ఎ మోడిగ్లియాని అనే 750 మిల్లీ లీటర్ల ఈ మంచినీటి బాటిల్ ధర అక్షరాల రూ.45 లక్షలు. ఇది ఎందుకు అంత ఖరీదు అనుకుంటున్నారా? ఫ్రాన్స్, ఫిజీలోని సహజ నీటిబుగ్గల నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించి ఈ బాటిల్లో నింపుతారు. దీని లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తాయరు చేశారు. ఈ నీళ్లు కూడా ప్రత్యేక రుచిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా మేలు చేస్తాయట. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)