సాత్విక్ వర్మ, అనీ జంటగా నటిస్తున్న చిత్రం తొలి ప్రేమకథ. సాయిలక్ష్మణ్ అల్లు దర్శకుడు. లతా.కె నిర్మాత. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. హీరో ఆకాశ్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

ఇది మ్యూజికల్ లవ్‌స్టోరీ అని, ధ్రువన్ అద్భుతమైన సంగీతం అందించారని, దర్శకుడు జనరంజకంగా సినిమా తీశారని హీరో సాత్విక్ వర్మ చెప్పారు. సినిమా బాగా వచ్చిందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని దర్శకుడు సాయిలక్ష్మణ్ అల్లు తెలిపారు. ఈ అందమైన ప్రేమకథ తప్పకుండా అందరికీ నచ్చుతుందని సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ కంద, సమర్పణ: లిఖిత్, ఆదిత్య.















