రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ సేనలకు స్టార్లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహ సేవలను కొనసాగిస్తామని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ తెలిపారు. యుద్ధం ప్రారంభం నుంచి ఈ ఇంటర్నెట్ సేవలను ఆ దేశానికి మస్క్ ఉచితంగా అందిస్తున్నారు. స్టార్లింక్ సాయంతో శత్రువుల కదలికలను కనిపెట్టి దాడులు చేయగలిగామని ఉక్రెయిన్ సైనం కూడా ఈ సాంకేతికతను కొనియాడారు. స్టార్లింక్ సేవలను ఉచితంగా అందించలేమని మాస్ చెప్పారు. ఈ విషయంలో అమెరికా సాయం అందించాలని కోరారు. తరువాత రోజు అనూహ్యంగా మస్క్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. స్టార్లింక్కు నష్టం వచ్చినా, తమ గ్రూపులోని మిగతా సంస్థలు భారీగా లాభాలు ఆరిస్తున్నాయని, కాబట్టి ఉక్రెయిన్కు ఇంటర్నెట్ ఉపగ్రహ సేవలు ఉచితంగానే అందిస్తామని మస్క్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)