2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగుతోంది. అయితే ఈ ఎన్నికల పోటీలో పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ను వెనకకు నెట్టివేసేందుకు భారతీయ సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు పావులు కదుపుతున్నారు. అమెరికాను తిరిగి గ్రేట్‌గా నిలబెట్టాలంటే ట్రంప్ కాకుండా మరోక్కరు పార్టీ తరఫున అభ్యర్థిగా ముందుకు రావాల్సి ఉందని ప్రచారం సాగిస్తున్నారు. ట్రంప్‌పై పలు చట్టపరమైన వ్యాజ్యాలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ సొంత రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థి ఎంపిక రేస్‌లో ట్రంప్ వివిధ రౌండ్లలో ముందంజలో ఉన్నారు. అయితే ట్రంప్‌కు పోటీగా నిలిచేందుకు ముగ్గురు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి , నిక్కీ హేలీ, హిర్ష్ వర్ధన్ సింగ్‌లు వేర్వేరుగా తమ బలం సంతరించుకుంటున్నారు. వచ్చే ఏడాది జులై 15 నుంచి 18 వరకూ విస్కాన్సిన్లోని మిల్వావుకిలో జరుగుతాయి. ఈ దశలో ఈ ముగ్గురు పార్టీ తరఫున అభ్యర్థులుగా తమ నామినేషన్లకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.