
వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం లీగల్లీ వీర్ . రవి గోగుల దర్శకుడు. శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇప్పటివరకూ ఇలాంటి లీగల్ థ్రిల్లర్స్ తెలుగు తెరపై రాలేదని, రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని, ఈ నెల 27న సినిమాను విడుదల చేస్తున్నామని హీరో వీర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డానని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జాక్సన్ జాన్సన్, అనూష్, సంగీతం: శంకర్ తమిరి, సమర్పణ: ఎం.వీరనారాయణరెడ్డి, నిర్మాణం: సిల్వర్ కాస్ట్.
