సుహాస్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ప్రసన్నవదనం. ఈ సినిమా ద్వారా అర్జున్ వైకే దర్శకుడు. జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సుహాస్ మాట్లాడుతూ ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన నెరేషన్ అచ్చం సుకుమార్‌గారి నెరేషన్లానే ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ అదిరింది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం. ఈ కథకు తను యాప్ట్. టెక్నికల్‌గా నెక్ట్స్ లెవల్ సినిమా ఇది అని పేర్కొన్నారు. సుకుమార్ శిష్యుడైనప్పటికీ దర్శకుడు అర్జున్‌ది డిఫరెంట్ ైస్టెల్. ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇంకా కథానాయిక రాశి సింగ్ కూడా మట్లాడారు. స్క్రీన్‌ప్లే బేస్ట్ మూవీ అని ఈ టీజర్ చెప్పకనే చెబుతున్నదని, సుహాస్ గతంలో ఎన్నడూ చూడని ఇంటెన్స్ పాత్రలో కనిపించారని, వైవా హర్ష, నందు, నితిన్, హర్షవర్దన్ పాత్రలు కూడా ఇందులో కీలకమని టీజర్ చెబుతున్నదని చిత్ర యూనిట్ తెలిపారు.