Skip to main content

Namaste NRI

ఇట్లు అర్జున విడుదల అప్పుడే

వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ఇట్లు అర్జున. అనీష్ హీరోగా, దర్శకుడిగా మహేష్ ఉప్పల పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా, అనస్వర రాజన్ చేతులు కట్టబడి, విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో అనీష్ చెవిటి, మూగ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నేపథ్యం కథలో ఆసక్తికరమైన అంశాన్ని యాడ్ చేస్తోంది.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఏ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటి కే ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events