పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ పేరు మార్చుకొని మళ్లీ భారత్‌లోకి రానున్నట్టు తెలుస్తున్నది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఈ యాప్ పేరును ticktockగా మార్చి భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఈ పేరుకు పేటెంట్ కోసం భారత్‌లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు టెక్ మాస్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. ఈ నెల 6వ తేదీనే బైట్ డ్యాన్స్ దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపారు. అయితే దీనిపై బైట్ డ్యాన్స్ ఎలాంటి ద్రువీకరణ ఇవ్వలేదు. చైనాతో వివాదాలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ టిక్‌టాక్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.