Namaste NRI

టైగర్‌ నాగేశ్వరరావు నూపూర్‌ సనన్‌ ఫస్ట్‌లుక్‌

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు.  నూపూర్‌ సనన్‌ కథానాయిక.  వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్‌ మరో నాయికగా నటిస్తున్నది.   1970 దశకంలో స్టూవర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నూపూర్‌ సనన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రైలులో పయనిస్తూ ఎవరి కోసమో వేచిచూస్తున్న ఈ ఫొటో రెట్రో ఫీల్‌తో ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో టైగర్‌ ప్రేయసి సారాగా నూపూర్‌ సనన్‌ పాత్ర అభినయ ప్రధానంగా సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. అక్టోబర్‌ 20న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.మది, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events