Skip to main content

Namaste NRI

టైగర్ నాగేశ్వరరావు థియేట్రికల్ ట్రైలర్ విడుదల

రవితేజ టైటిల్ రోల్‌లో, యంగ్ టాలెంటెడ్ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత,  మయాంక్ సింఘానియా సహ నిర్మాత. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్‌గా కనిపించారు, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ముంబయ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్‌గా కనిపించారు. టైగర్ నాగేశ్వరరావు యాక్షన్- ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథని చూపించిన విధానం యునిక్‌గా వుంది.

 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో  దర్శకుడు వంశీ మాట్లాడుతూ రవితేజ ఫిల్మ్ లవర్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వల్లనే ఈ సినిమా సాధ్యపడింది. అనుపమ్‌తో ఈ సినిమాలో పని చేయడం ఆనందంగా వుంది. అలాగే నుపూర్, గాయత్రి, రేణు దేశాయ్ సహా చాలా మంచి నటీనటులతో ఈ చిత్రాన్ని చేశాం. అభిషేక్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తీశారు అని తెలిపారు.  రవితేజ మాట్లాడుతూ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హిందీలోకి రావడం ఆనందంగా వుంది. హిందీకి నేనే డబ్బింగ్ చెప్పాను. టైగర్ నాగేశ్వరరావు తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది అని అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ  రవితేజతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని తీశాము అని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈనెల 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఈవెంట్‌లో అనుపమ్ ఖేర్, గాయత్రి, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events