Namaste NRI

ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు

సుధీర్‌బాబు  హీరోగా రూపొందిన చిత్రం హరోంహర. మాళవిక శర్మ కథానాయిక.  జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకుడు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశా రు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడారు. ఇండియన్‌ స్క్రీన్‌ మీద హరోం హర  లాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదు. ఇందులో నా పేరు సుబ్రహ్మణ్యం. వృత్తి గన్‌ స్మిత్‌. కేరక్టర్‌ ఎదిగేకొద్దీ రకరకాల గన్స్‌, ల్యాండ్‌ మైన్స్‌, రాకెట్‌ లాంచర్స్‌.. ఇలా చాలా తయారు చేస్తాడు. సింగిల్‌ లైన్లో చెప్పాలంటే జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం. మన పక్కింటి కుర్రాడికి గన్‌ తయారు చేసే నాలెడ్జ్‌ వుంటే తను ఎలా తయారు చేస్తాడనే తరహాలో ఆసక్తిక రంగా సాగుతుందీ సినిమా. ఈ గన్స్‌ విషయంలో దర్శకుడు చాలా రీసెర్చ్‌ చేశారు. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ టాప్‌ క్లాస్‌లో వుంటాయి. ఈ సినిమాకోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించాడు దర్శకుడు జ్ఞానసాగర్‌ అన్నారు.  ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన దర్శకులు అనిల్‌ రావిపూడి, సంపత్‌నంది, నిర్మాతలు కె.ఎల్‌.దామోదరప్రసాద్‌, బెక్కెం వేణుగోపాల్‌ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events