ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సినిమా టిల్లు స్వేర్. బ్లాక్‌బస్టర్ డీజే టిల్లు కు ఈ సినిమా కొనసాగింపు కావడంతో యువతరం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలన్నీ విశేష ప్రజాదరణ చూరగొన్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన దర్శకుడు మల్లిక్‌రామ్‌ను అభినందించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ని జారీ చేసింది. డీజే టిల్లును మించే స్థాయి విజయాన్ని టిల్లు స్కేర్ సాధిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నది. టిల్లు పాత్ర, సిద్ధు జొన్నలగడ్డ పలికే సంభాషణలు, అనుపమా పరమేశ్వరన్ అందం, అభినయం, సిద్ధు, అనుపమ కాంబినేషన్ సన్నివేశాలు థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని అందిస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాశ్, సంగీతం: రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్మెంట్స్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.