Namaste NRI

ఖిలాడీ లేడీ ఎంట్రికి టైం ఫిక్స్

రవి తేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ఖిలాడి. మీనాక్షి చౌదరి, డిరపుల్‌ హయాతి కథానాయికలు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 5న క్యాచ్‌ మీ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో డిరపుల్‌ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకునేలా కనిపించింది. ఈ పాటకు వైట్‌ కలర్‌ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్‌ చేస్తూ అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది డిరపుల్‌ హయతి. ఈ చిత్రంలో రవితేజ రెండు భిన్న పాత్రలో కనిపంచనున్నారు.  ఈ చిత్రంలో అర్జున్‌ సార్జా, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events