ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాతో బీహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిరది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినే నితీశ్ ఆర్జేడీ లెఫ్ట్ కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం (ఆగస్టు 10) సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘట్బంధన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నితీశ్ గవర్నర్ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు నితీశ్ కుమార్ అందజేశారు. దీంతో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.