కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న నటించిన మల్టీస్టారర్ మూవీ కబ్జ. శ్రియాశరణ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్.చంద్రు దర్శకత్వం. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా కథ 1947 నుండి 1984 మధ్య జరుగుందని సమాచారం. అనుకోని పరిస్థితుల్లో ఓ స్వాతంత్ర సమరయోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అని కాన్సెప్ట్తో సినిమా ఉండనుందని తెలుస్తుంది.
ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా మార్చి 17న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్లో ఉపేంద్ర విలన్‌ను చావగొట్టి బైక్పై పడుకోబెట్టి తీసుకెళ్తున్నాడు. కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సముద్రఖని, మురళీ శర్మ, నవాబ్ షా, కబీర్ దుహాన్ సిఒంగ్, దనీష్ అకర్త షఫి, ప్రదీప్ సింగ్ రావత్, కృష్ణ మురళి పోసాని, ప్రమోద్ శెట్టి, అనూప్ రెవనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠి, బెంగాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇలా ఏడు భాషల్లో విడుదలవుతున్న మొదటి కన్నడ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.