Namaste NRI

చర్చలకు సమయం … లేదంటే ఆ దేశానికి భారీ నష్టం

శాంతి చర్చలను తక్షణమే చేపట్టాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాను కోరారు. దాడుల్ని తగ్గించుకోవాలని, ప్రాంతీయ సమగ్రతను, న్యాయాన్ని పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. చర్చలు నిర్వహించేందుకు సమయం ఆసన్నమైందని, లేదంటే రష్యాకు భారీ నష్టం జరుగుతుందని, దాని నుంచి కోలుకునేందుకు ఆ దేశానికి తరాలు పడుతుందని అన్నారు. మారిపోల్‌ నగరంలో భీకర ఘర్షణ జరుగుతోంది. రెండు దేశాల సైన్యం తలపడుతోంది. నగరంలో 80 శాతం బిల్డింగ్‌లు దాదాపు ధ్వంసం అయ్యాయి.  మారిపోల్‌ వద్ద ఓ థియేటర్‌పై బాంబు వేశారు. ఆ ఘటనలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events