Namaste NRI
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి మద్దిల గురుమూర్తి ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే.