వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. అర్జున్ రెడ్డి ఫేం గిరీసాయ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మీ పక్కింటి కుర్రాడు తరహాలో నటించా. నా పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను స్వామివారి ఆశీస్సులతో విడుదల చేశాం. తిరుపతిలో ప్రారంభించిన చిత్ర ప్రచార కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తాం అని తెలిపారు. సెలబ్రేషన్ మూడ్‌లో కలర్‌పుల్‌గా సాగుతున్న వెడ్డింగ్ టైటిక్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. రోల్ రైడా రాసిన ఈ పాటను సాగర్, శ్రీనిష జే పాడారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫన్, లవ్, ఎమోషనల్ ట్రాక్‌తో సాగుతూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల అవుతుంది.