చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే టార్గెట్‌తో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రెసిడెంట్ జై బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇండో`పసిఫిక్ ప్రాంతంలో స్టెబిలిటీ, శాంతిని నెలకొల్పే లక్ష్యంతో జరిగిన ఒప్పందంతో మూడు దేశాలు ఆకస్(ఏయూకేయూఎస్) కూటమిగా ఏర్పడ్డాయి. న్యూక్లియర్ పవర్డ్ సబ్ మెరైన్ల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్ సహకరించనున్నాయి. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలకమైన ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతున్న చైనా శక్తిని తగ్గించడానికి మూడు దేశాలు కలిసి పనిచేస్తాయని జో బైడెన్ తెలిపారు. వైట్ హౌస్ ఈస్ట్ రూం నుంచి మాట్లాడిన బైడెన్ ఇండో పసిఫిక్ రీజియన్‌లో శాంతికి, స్థిరత్వానికి సహకరించుకోవాలని మూడు దేశాలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయన్నారు.