Namaste NRI

మా ప్రయత్నానికి తగిన ఫలితం దక్కింది

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన సినిమా ధూం ధాం. సాయికిశోర్‌ మచ్చా దర్శకుడు. ఎఎస్‌ రామ్‌కుమార్‌ నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిం చబడుతున్నదని సినిమా కు కథ స్క్రీన్‌ప్లే అందించిన గోపీమోహన్‌, చిత్ర నిర్మాత రామ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. థియేటర్లలో స్పందన బావుంది. కలెక్షన్లు కూడా బావున్నాయి. ఈ సినిమాతో హీరో చేతన్‌ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేక్షకుల్ని మరింత ఆకర్షించేలా ప్రమోషన్స్‌లో వేగం పెంచాం. మా సంస్థ నుంచి వస్తున్న తదుపరి సినిమా వివరాలను మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. చేతన్‌తోనే మా నెక్ట్స్‌ సినిమా కూడా ఉంటుంది అని నిర్మాత తెలిపారు.

 రైటర్‌ గోపీమోహన్‌ మాట్లాడుతూ ఫస్టాఫ్‌ అంతా పాటలు, సెకండాఫ్‌ అంతా కామెడీ ఉండాలని ప్లాన్‌ చేసి తీసిన సినిమా ఇది. మా ప్రయత్నానికి తగిన ఫలితం థియేటర్లలో కనిపిస్తున్నది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. సెకండాఫ్‌లో వెన్నెలకిశోర్‌ కేరక్టర్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా కథ, కథనం బావుందని అందరూ మెచ్చుకుంటున్నారు అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]