భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతి ఏటా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ జవనరి 9, 1915న దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ ముంబైకి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారాన్ని గుర్తించడానికేనని అన్నారు.
ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు 50 పైగా వివిధ దేశాలలో చురుకుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు విదేశాలలో ఉంటున్న తోటి వారికి కరోనా సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేశారని గుర్తు చేశారు. ఎన్నారైల తరపున ప్రవాస ప్రవాస భారతీయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.