రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్‌వర్మ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీటీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. సుశాంత్, శ్రీరామ్, అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఓ హత్యకేసు పరిశోధనతో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రవితేజను లాయర్ పాత్రలో పరిచయం చేశారు. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా సాగాయి. సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురుణ్ణి దాటి వెళ్లాలి అంటూ రవితేజ చెప్పే సంభాషణ మరింత ఆసక్తిని పెంచింది. క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. దర్శకుడు సుధీర్‌వర్మ తనదైన స్టెలిష్ మేకింగ్‌తో తెరకెక్కించాడు అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కథ, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్వర్మ.