అఫ్గానిస్థాన్లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అమ్మాయిలను వర్సిటీల్లోకి అనుమతించే వరకు క్లాసులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఉన్నత విద్యను దూరంచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలను తరగతులకు వచ్చేవారకు తమ ఈ నిరసన కొనసాగుతుందని ముజాముల్ అనే విద్యార్థి స్పష్టం చేశాడు. అప్పటివరకు తాము చదువుకునేది లేదని చెప్పాడు. తమ సోదరీమణులకు యూనివర్సిటీ విద్యను బంద్ చేశారు. అలాగైతే తాము కూడా వర్సిటీలకు వెళ్లేది లేదని తెలిపాడు. అమ్మాలకు వర్సిటీ విద్యపై తాలిబన్ ప్రభుత్వం గతవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే.