Namaste NRI

నేడు ప్రధాని మోదీ అమెరికా పయనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (బుధవారం) బయల్దేరి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఐరాస సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సుల్లో మోదీ పాల్గొంటారు. ఈ నెల 24న శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో, అంతకు ముందురోజు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ భేటీ అవుతారు.  జో బైడెన్‌, మోదీ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలతో పాటు, పలు ద్వైపాక్షి, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కమలతో భేటీ సందర్భంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వాతావరణ మార్పులపై మోదీ ఆమెతో  చర్చిస్తారు. వీరిద్దరి మధ్య జరిగే తొలి అధికారిక భేటీ ఇదే కావడం విశేషం. ప్రధాని మోదీ 26న తిరిగి భారత్‌కు వస్తారు. ప్రధానితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశకంర్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events