Namaste NRI

మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు… పలువురికి ఈడీ సమన్లు

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా విచారణకు హాజరు కావాలని పలువురు సినీ తారలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సహా 10 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  జాబితాలో ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, రవితేజ, తరుణ్‌, పూరీ జగన్నాథ్‌, నవదీప్‌, మొమైత్‌ ఖాన్‌, నందు, శ్రీనివాస్‌ ఉన్నట్లు సమాచారం. వీరికి ఈడీ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా చాలా రోజుల తర్వాత ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అంతేగాక ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు వీరిని విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events