అమెరికా లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కుదిపేసింది. ఈ టోర్నడో తుపాను కారణంగా ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. తీవ్రమైన పెను గాలుల ధాటికి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ టోర్నడో తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తీవ్రమైన ఈ తుపాను కారణంగా భవనం పైకప్పులు కూలిపోయాయి. కారు అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇది ఒక విపత్తు’ అని స్థానికి వ్యాపారి ఒకరు వెల్లడించారు. కాగా, అక్కడ తాజా వాతావరణ పరిస్థితుల్ని పరిశోధిస్తున్నట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. మరోవైపు ఈ టోర్నడోను బలహీనమైన సుడిగాలి గా అభివర్ణించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/d5b7f241-3200-42f7-aeb9-47b1f0e899f3-5.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/WB-5.jpg)