అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడో కెంటికీ రాష్ట్ర చరిత్రలో అత్యంత తీవ్రమైనదన్నారు. టోర్నడోలతో భారీగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో పలు ఇండ్ల, భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల కేవలం గోడలు మాత్రమే మిగిలాయి. ఆగ్నేయ రాష్ట్రం కెంటరీలో టోర్నడో సృష్టించిన విలయానికి 100 మందికి పైగా మరణించారని గవర్నర్ ఆండీ బెషీర్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని అన్నారు. కెటుంకీ చరిత్రలోనే అత్యంత దారుణ టోర్నడో బీభత్సంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. మరోవైపు ఇల్లినాయిస్ రాష్ట్రంలో అమెజాన్ భారీ గిడ్డంగిని గాలి తుఫాను చీల్చింది. సుమారు వంద కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.