కెనడాలో కరోనా విజృంభిస్తుంది. రోజు వారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయిన వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న వారి విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోనివారిని ఉద్దేశించి కొత్తగా హెల్త్ టాక్స్‌ను తీసుకురావాలని ఆలోచిస్తోంది. వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న వారి నుంచి హెల్త్ టాక్స్‌ను వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకొని ప్రజలు ఇతరులకు ఆర్థికంగా భారం అవుతారని అభిప్రాయపడ్డారు. 100 కెనడియన్ డాలర్లకు తగ్గకుండా హెల్త్ టాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)